Q6 వెబ్ సైట్
కుక్కలను కూడా వొదలని అధికారులు, కుక్కల పేర్లు చెప్పుకొని కూడా ప్రజా ధనం స్వాహా చేస్తున్న పెద్ద తలకాయలు, మిమ్మల్ని చూసి ఆ శునకాలు కూడా సిగ్గుతో తల దించుకుంటున్నాయి , ప్రభుత్వ ప్రాజెక్టులలో నాణ్యతలో దోపిడీ, ప్రజల ఆరోగ్యాలపై నిధులలో దోపిడీ, ప్రజలకు చెందాల్సిన పథకాలలో దోపిడి ,మొత్తానికి ప్రజాధనాన్ని బకాసురుల్లాగా ప్రభుత్వ ఖజానాని కాలి చేస్తున్న విషయం మనందరికీ తెలుసు, కానీ, చివరకు కుక్కల పైన దొంగ లెక్కలు చెప్పి కూడా ప్రజాధనాన్ని ఈ విధంగా తింటున్న అధికారులని ఏమనాలి, ఇది సామాన్య ప్రజలు అడుగుతున్న ప్రశ్న,
జగిత్యాల పట్టణంలో కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడానికి, 70 లక్షల నిధులు మంజూరు,
జగిత్యాల పట్టణంలో కుక్కల బెడద ఎక్కువ అవ్వడంతో, ఇక నుండి కుక్కల సంతానం ఎక్కువ అవ్వకూడదని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు.
ఒక్కో కుక్కకు రూ.1400 చొప్పున 5000 కుక్కలకు రూ.70 లక్షల నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు.
కానీ పట్టణ వాసులు మాత్రం పట్టణంలో మొత్తం సుమారు 2000 కుక్కలు మాత్రమే ఉంటాయని.. కుటుంబ నియంత్రణ చేసేది మగ కుక్కలకే అయితే 5000 కుక్కలు ఎక్కడ నుండి వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుక్కల దగ్గర కూడా డబ్బులు తింటున్నారా అని జగిత్యాల పట్టణ వాసులు మండిపడ్డారు.