గజ్వేల్ ,డిసెంబర్, 19 (Q6 న్యూస్) రిపోర్టర్ మురళి
డ్రగ్స్ మహమారిని తరిమేద్దాం డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం
గజ్వేల్ సిఐ సైదా, అడిషనల్ సీఐ ముత్యం రాజు ,
ఈ సందర్భంగా గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదా మాట్లాడుతూ నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్లను వాహనాలు తనిఖీ నిర్వహించే సమయంలో అనుమానం ఉన్న వ్యక్తులను నార్కోటిక్ డ్రగ్స్ టెస్టింగ్ మిషన్ల ద్వారా పరిశీలించడం జరుగుతుందన్నారు. యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన సూచించారు.
మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో వుందని ఈ ప్రమాదం భారిన పడకుండా యువత అప్రమత్తంగా వుండాలని కేవలం క్షణికానందం కోసం మత్తు పదార్థాల సేవించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాలను సాధించడం ఓ కలగానే మిగిలి పోతుందని, కొంత మంది వ్యక్తులు తమ డబ్బు సంపాదన కోసం గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు విక్రయాలకు పాల్పడి యువతకు అందించడం జరుగుతోందని, ఇలాంటి స్వార్థపరుల చేతుల్లో యువత బలికావద్దని, ఎన్నో ఆశలతో మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించి మీ బంగారు భవిష్యత్తుకై ఎదురుచూసే తల్లిదండ్రులకు తమ పిల్లలు మత్తు పదార్థాలకు బానిసలుగా మారడంతో తల్లిదండ్రులు ఎంతో మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు.
ప్రతి ఒక్కరు మీ తల్లిదండ్రుల గురించి ఒక్కసారి ఆలోచించాలని, మత్తు పదార్థాల వినియోగం ద్వారా ఆర్థికంగా నష్టపోవడంతో పాటు, ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయని యువత గ్రహించాలని, అలాగే మీ తోటి మిత్రులు గంజాయిని సేవిస్తున్నట్లయితే మత్తు పదార్థాల వినియోగం ద్వారా నష్టాలపై వారి అవగాహన కల్పించాలని, ప్రధానంగా గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణకు రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం ప్రత్యేక చోరవ చూపిస్తోందని, ప్రభుత్వం అందించే సబ్సిడీల ద్వారా ఉపాధి పొందాలని సూచించారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు సేవిస్తున్నా , రవాణా, విక్రయాలు పాల్పడుతున్నా వారిని పట్టుకోవడం మరియు నిఘా పెంచడం జరిగిందని తెలిపారు.
డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న లేక విక్రయించినట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 లేదా గజ్వేల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.