Q6 news web site
రిపోర్టర్ వంశీ కిష్ణ
భద్రాచలం పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం కు సంబంధించిన పురుషోత్తపట్నం గ్రామంలో గల భూములు పరిరక్షించేందుకు వెళ్లిన ఈవో రమాదేవి మరియు వారి అర్చకులు,
ఆలయ సిబ్బందిపై దాడులు చేయడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, అట్టి దాడులను యాదగిరిగుట్ట దేవస్థానం ఆలయ ఉద్యోగుల యూనియన్ తరపున తీవ్రంగా ఖండించడం జరిగింది.
భద్రాచలం దేవస్థానమునకు చెందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది మరియు కార్యనిర్వహణాధికారి పై దాడికి కారణమైన వారిని చట్ట పరంగా శిక్షించాలని మరియు ఇట్టి విషయం లో ప్రభుత్వం చొరవ తీసుకుని ఆలయ భూములు కాపాడుకొనుట కోసం ఉద్యోగులకు తోడ్పాటు అందించగలరని కోరారు.
ఈ కార్యక్రమం లో ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ రమేష్ బాబు, ఏఈఓలు, పర్యవేక్షకులు, అర్చకులు, సిబ్బంది, ఇతర మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.