Q6 వెబ్ సైట్ మేడ్చల్
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారి వివేకానంద విగ్రహం నుండి ముఖ్యమైన మార్కెట్ లో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిన్న మున్సిపల్ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు కలిసి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి తోపుడుబండ్లను మరియు షాప్ ల ముందుండే షెడ్లను కూల్చివేయడం జరిగిందనీ పాతూరి సుధాకర్ రెడ్డి బిజెపి రాష్ట్ర నాయకులు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 30 , 40 ,సంవత్సరాలుగా పండ్లు పూలు చిన్న చిన్న చిరు వ్యాపారం చేసుకునే SC ST BC బడుగు బలహీన వర్గాల వారిని దౌర్జన్యంతో అక్కడినుంచి తరలించడం అమానుష్యం ఇది ఆప్రజాస్వామ్యం అని దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గతంలో టిఆర్ఎస్ అధికార పార్టీ సామాన్య ప్రజలపై చేసిన దౌర్జన్యాలను అఘాయిత్యాలను గత సంవత్సరం కాలంగా కొనసాగిస్తుందని, మేడ్చల్ నియోజకవర్గ, జిల్లా కేంద్రం అయినా మేడ్చల్ నగరం చుట్టూ ముట్టు ప్రాంతాలు 1990 నుండి ఇప్పటివరకు దాదాపు గత 35 సంవత్సరాల నుండి గతంలో TDP కాంగ్రెస్ తెరాస ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రజలకు కనీస అవసరాలు అయినా విద్యా, వైద్యం, రవాణా, వ్యాపార మార్కెట్ కు సంబంధిత కనీస మౌలిక సదుపాలు కల్పించక పోవడం పట్ల దాపు రెండు లక్షల మంది ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులకు కాంగ్రెస్ పార్టీ పాలక ప్రజా ప్రతినిధులకు కనీసం 15 రోజులు వ్యాపారస్తులకు ముందస్తు సమాచారం నోటీసు ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం లేకపోవడం బాధాకరం అన్నారు, రోడ్లపై వ్యాపారం చేసే చిరు వ్యాపారస్తులు, షాపింగ్ కాంప్లెక్స్ యజమానులు మున్సిపల్ అధికారుల దుందుడుకు చర్యల వల్ల లక్షల్లో నష్టపోయారనీ. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పూలు పండ్లు కూరగాయలు అమ్మే వారికి శాశ్వతంగా మేడ్చల్ నగరంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యాడ్ సముదాయాల్లో మార్కెటింగ్ చేసుకునే స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు,
ఈ కార్యక్రమంలో , మురళీధర్ గుప్తా మేడ్చల్ మాజీ సర్పంచ్, కానుకంటి వంశీ వంజరి బీజేవైఎం నగర అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు