Q6 న్యూస్,, వెబ్ సైట్ ,
మేడ్చల్ పట్టణానికి చెందిన బురుగు రవీందర్ తన కుమారుడు సాయి సాత్విక్ (13) ఇద్దరు కలిసి మంగళవారం రాత్రి కండ్లకోయాలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగే ఫంక్షన్ కి తండ్రి కొడుకులు రాత్రి 9 గంటల సమయంలో, ద్విచక్ర వాహనంపై బయలుదేరారు, మేడ్చల్ చెక్ పోస్ట్ దగ్గర వీరు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, వెనుక నుండి అతి వేగంగా వచ్చిన లారీ బైకును ఢీకొట్టడంతో, తండ్రి కొడుకులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు, వీరిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాయి సాత్విక్ మరణించినట్టు వైద్యులు తెలిపారు, తండ్రి రవీందర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు,