Q6 న్యూస్ Web site

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫోన్ ట్యాపింగ్ పేరిట చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. దానికి తోడు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న లీకులు, వాటి ఆధారంగా కొన్ని టీవీ చానెళ్లు, యూట్యూబ్ చానెళ్లు రెచ్చిపోయాయి
ఇది శృతిమించి మహా టీవీ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లాంటివి అల్లిన అబద్ధపు కథనాలు చివరికి ఆ టీవీ చానెల్ ఆఫీసు మీద నిరసనకారులు దాడిచేసే వరకూ వెళ్లాయి.
అయితే ఇవ్వాళ హిందూ దినపత్రిక రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కోట్ చేస్తూ రాసిన ఒక సంచలనాత్మక కథనం అసలు హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కానే కాలేదని కుండబద్ధలు కొట్టింది. సినిమాతారలకు సంబంధించిన ఫోన్లు ట్యాప్ అయినట్టుగా ఏ ఆధారమూ లేదని, ఇదంతా మీడియా హడావిడి మాత్రమే అని హిందూ దినపత్రిక కరస్పాండెంట్‌తో సదరు పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు
సో! ఇన్నాళ్లుగా కాంగ్రెస్ నాయకులు చెప్పింది అబద్దం అని బీఆర్ఎస్ నాయకులు చెప్పిందే నిజం అని తేలింది. అసలు ఏ ఆధారమూ లేకుండానే కేసీఆర్ మీద, కేటీఆర్, హరీశ్ రావుల మీద కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేసిన కథనాలు అవాస్తవాలు అని తేలిపోయింది.