Monday, December 23, 2024

తెలంగాణ ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేసాం అని చెప్పడంతో, రుణమాఫీ కాని  రైతులంతా బ్యాంకుల వద్ద చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు, వాళ్లకు తెలియదు, అందరికీ రుణమాఫీ కాలేదు అనే విషయం,

ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ సంపూర్ణంగా,రుణమాఫీ చేసింది కేవలం, మా గ్రామంలోనే 50 నుంచి 100 మందికి రుణమాఫీ కాలేదు అంతే, అని అంటుర్రు, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న మీ, గ్రామంలోనే వందమందికి రుణమాఫీ కాకపోతే, ఇతర వేరే పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల గ్రామాల్లో పరిస్థితి ఏంది,?? సారూ మీ గ్రామంలోనే వందమందికి రుణమాఫీ కాకపోతే తెలంగాణలా ఉన్నటువంటి 33 జిల్లాలలో ఎన్ని గ్రామాలు ఉన్నయి, ఆ గ్రామాలలో ఒక్కో గ్రామానికి , 100 చొప్పున లెక్కపెడితే ఎన్ని లక్షల మందికి రుణమాఫీ కాలేదో, దీని బట్టి మీ మాటల్లోనే అర్థమవుతుంది, సర్కారు సంపూర్ణంగా రుణమాఫీ చేయలేదని మీరే ఒప్పుకుంటునట్టు కదా?

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రెండు లక్షల లోపు అర్హులైన, రైతులందరికీ రుణమాఫీ చేశామని ప్రకటించడంతో , నిజమని నమ్మిన రైతులంతా సంతోషంతో, బ్యాంకుల వద్దకు వెళ్లి ఆరా తీసి తమకు రుణమాఫీ కాలేదని, తెలియడంతో నిరాశ చెంది మమ్మల్ని మోసం చేశారు మాకు రుణమాఫీ కాలేదనీ,  గ్రామాలలో మా,పనులు వదులుకొని బ్యాంకుల వద్దకు వస్తే, బ్యాంకు వాళ్లేమో మీకు రుణమాఫీ కాలేదని అంటుర్రు, కాంగ్రెస్ సర్కార్ ఏమో రుణమాఫీ చేసినం అంటుర్రు, ఇందులో ఏది నిజం రైతులకి తప్పుడు సమాచారమిచ్చి పక్కదోవ పట్టిస్తున్న నాయకులధా,లేక బ్యాంకు వలదా, ఇప్పటికైనా సంపూర్ణమైన రుణమాఫీ చేయలేదని మీడియా ముఖంగా ప్రకటించండి అప్పుడైనా కనీసం గ్రామాల నుంచి రైతులు రోడ్లమీదకి వచ్చి అవస్థలు పడడమైన తప్పుతుందని చెప్పి చాలామంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News