Q6 వెబ్ డెస్క్,
గజ్వేల్ సెప్టెంబర్ 12,Q6 న్యూస్ రిపోర్టర్ మురళి )
-5 గురు వ్యక్తులు అరెస్ట్,5 వేల నగదు,5 ఫోన్లు రికవరీ
చట్ట వ్యతిరేకమైన కార్యకలపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సిద్దిపేట ట్రాన్స్పోర్ట్ పోలీసులు హెచ్చరించారు. గురువారం
గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంగుపల్లి గ్రామ శివారులో ఉన్న కుర్మ సంఘం బిల్డింగులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నరాన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు, వారిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమ్మదగిన సమాచారం తో సంగుపల్లి పేకాట స్థావరంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ పోలీసులు, గజ్వేల్ పోలీసులు సంయుక్తంగా వెళ్లి రైడ్ చేసి పట్టుకున్నామన్నారు.వారి వద్ద నుండి రూ.5వేల100 నగదు, 05 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నమన్నారు. పేకాట ఆడిన వారిలో సంగుపల్లి గ్రామానికి చెందిన బక్కోళ్ల కుమార్,గజ్జల మల్లేష్,బక్కోళ్ల రమేష్, ఎర్రబెరి ముత్యాలు, పెద్దాపుల్ల ప్రశాంత్ ఉన్నారన్నారు.
గ్రామాలలు, పట్టణాలు ఫామ్ హౌస్, ఇళ్ళల్లో పేకాట, బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే టాస్క్ఫోర్స్ పోలీసులకు తెలపాలన్నారు. వెంటనే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్, గజ్వేల్ పోలీసులు, తదితరులు ఉన్నారు