Monday, December 23, 2024

పోలీస్ స్టేషన్లోనే మహిళా పోలీసుకు రక్షణ కరువు,

Q6 న్యూస్ తెలుగు వెబ్ సైట్

ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్లోనే ఓ మహిళా ASI ఆత్మహత్యయత్నం చేసుకుంది

మెదక్ , చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న SI యాదగిరి చాలా రోజులుగా నన్ను వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి.

విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు  కానట్లు  కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నడని తెలిపిన ఏఎస్సై సుధారాణి.

కావాలని ఎస్సై యాదగిరి కక్షపూరితంగా దుర్భాషలడుతూ తనను మానసికంగా వేధిస్తున్నాడని ఏం చేయలేక ఎదిరించలేక పోలీస్ స్టేషన్ లో ఆత్మహత్యాయత్నం చేసిన, ASI సుధారాణి.

చికిత్స కోసం  హుటాహుటిన జోగిపేట ఆసుపత్రికి తరలింపు. ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన వైద్యులు ,

ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి చిల్లర పనులకు పాల్పడుతుంటే పోలీస్ వ్యవస్థ పై నమ్మకం పోతుందని ఇలాంటి టైం లోనే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని వెంటనే ఆ ఎస్సై పై తగిన చర్యలు తీసుకోవాలని Q6 న్యూస్ ఛానెల్ ద్వారా పై అధికారులను కోరుతున్న ప్రజలు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News