Monday, December 23, 2024

రైతు ప్రభుత్వం అని చెప్పి వంచించి రైతుల గొంతు కోసిన ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం

Q6 న్యూస్ web site,


-తెలంగాణ స్టేట్ బీజర్ఎస్ యూత్ వింగ్&ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా-

ములుగు అక్టోబర్ 19,( Q6)

సిద్దిపేట జిల్లా ములుగు మండలం ములుగు లో జుబైర్ పాషా-మీడియా సమావేశం నిర్వహించిరు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ను ఇవ్వదని కెసిఆర్ ముందునుండి హెచ్చరిస్తున్నారు ఈ రోజు అదే నిజమైందని జుబైర్ పాషా అన్నారు..!
పంట వేసిన రైతుకే రైతు భరోసా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టుగా మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేసి, రైతులను నమ్మించి గొంతు కోసిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని అన్నారు..,!
రైతు భరోసా కోసం ఎదురుచూసి ఎదురుచూసి కళ్ళు కాయలు కాచిన రైతులు పంటలు కోతలు కోసి కల్లాలకు వద్దకు వడ్లు తీసుకెళ్లే సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి రైతు భరోసా ఈ పంటకు ఇవ్వలేమని వచ్చే పంటకు చూస్తామని ఇంత దారుణంగా రైతుల నమ్మించి గొంతు కోశారని జుబైర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మూడు పంటలకు ఒక పంటకు రైతు బంధు కేసిఆర్ గారే ఇచ్చిందే ఇచ్చి మీగత రెండు పంటలకు ఎగబెట్టింది ఈ రేవంత్ సర్కార్ అని అన్నారు..!ఆనాడు పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి రైతులకు ఏం సమాధానం చెప్పు.. కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే 10 వేలు కాదు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం వంచించి మోసం చేసిందని, ఈరోజు వాళ్ళ నిజస్వరూపం బయటపడిందని కొప్పుల ఈశ్వర్ అన్నారు..!రైతులు తీసుకున్న రుణమాఫీ ఏక కాలంలో చేస్తమంటిరి అనేక వాయిదాలు పెడితిరి, రైతు భరోసా అందరికీ ఇస్తామని ఇప్పుడు చేతులెత్తేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం..!ఇప్పటికైనా రైతు లోకం ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతు విప్పాలి ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క కార్యక్రమాన్ని అమలు చేయకుండా మాయమాటలు దొంగ మాటలు చెప్పి తప్పించుకుంటూ రోజుకొక్క మాట, పూటకొక్క మాట చెబుతున్న ముఖ్యమంత్రి గా ఆయన్నే చూస్తున్నారన్నారు..!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News