మూసీ ప్రాజెక్టు సుందరీకరణకు అంత డబ్బు ఎందుకు?
– సౌత్ కొరియా పర్యటనలో నమ్మలేని నిజాలు కనుగొన్న జర్నలిస్టుల బృందం!
– మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పెద్ద స్కామే అని నిరూపిస్తున్న జర్నలిస్టుల కథనాలు.
– కొరియాలో హాన్ నది సుందరీకరణకు రూ 1600 కోట్ల నుండి రూ. 6090 కోట్లు అవుతున్నాయని రాసిన డక్కన్ క్రానికల్, టైంస్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు
– మరి మూసీ సుందరీకరణకు రూ 1,50,000 కోట్లు ఎందుకు అవుతాయని ప్రశ్నిస్తున్న తెలంగాణ ప్రజలు.
– మూసీ సుందరీకరణకు ప్రచారం కోసం కొరియాకు జర్నలిస్టులను తీసుకుపోతే ఉన్న బండారం బయటపడింది అని తలలు పట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
మూసీ సుందరీకరణ ప్రాజెక్టు పేరిట హడావిడిగా కూల్చివేతలు మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. ఎలాగైనా ఈ ప్రాజెక్టుకు కొంత పాజిటివ్ ప్రచారం చేసే ఉద్దేశంతో సుమారు 20 మంది జర్నలిస్టులతో దక్షిణ కొరియా పర్యటన ప్లాన్ చేస్తే అది రోజుకొక డిజాస్టర్ సృస్టిస్తోంది.
రెండో రోజు హాన్ నది సుందరీకరణ చూసొచ్చి టైంస్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ పత్రికల ప్రతినిధులు రాసిన కథనాలు చూసి రేవంత్ ప్రభుత్వానికి గొంతులో పచ్చి వెలక్కాయ పడింది.
2023లో మొదలైన హాన్ నది సుందరీకరణ ప్రాజెక్టుకు రూ 1600 కోట్లు అవుతాయని రాసిన డెక్కన్ క్రానికల్ ప్రతినిధి వంశీ కృష్ణ
హాన్ నది ప్రాజెక్టు తొలి దశకు కేవలం రూ 315 కోట్లు ఖర్చు చేశారని, రానున్న సంవత్సరాలలో రెండో దశకు మొత్తం వ్యయం రూ.6090 కోట్లుగా అంచనా వేశారని వేశారని టైంస్ ఆఫ్ ఇండియా విలేకరి కొరిడె మహేశ్ సియోల్ నుండి ఒక ప్రత్యేక కథనం రాశారు.
– మరి కొరియా వాళ్లు మొత్తం ఆరు వేల కోట్ల రూపాయలతో చేస్తున్న ప్రాజెక్టుకు తెలంగాణలో రేవంత్ రెడ్డి లక్షా యాభై వేల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
– ఇది దేశ చరిత్రలోనే పెద్ద స్కాం అవబోతుందా?