లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంగునూరి సత్యనారాయణ కు సన్మానం
గజ్వేల్ నవంబర్ 03(Q6) రిపోర్టర్ మురళి
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ లయన్ నంగునూరి సత్యనారాయణ కు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య మాట్లాడుతూ నంగునూరి సత్యనారాయణ సేవలు అభినందనీయమని, నేత్రదానం మహాదానం అనే నినాదంతో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతోమంది మరణించిన వారి నేత్రాలను సేకరించే కార్యక్రమంలో ముఖ్య భూమిక పోషిస్తూ, అన్నదానం మహాదానం అనే నానుడి నిజం చేస్తూ ప్రతి అమావాస్య రోజున అన్నదాన కార్యక్రమంలో అన్ని తానై ప్రతినెల దాతల సహకారంతో నిర్వహించే అమావాస్య అన్నదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న నంగునూరి సత్యనారాయణకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలియజేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు మల్లేశం గౌడ్, లయన్ నేతి శ్రీనివాస్, లయన్ మతిన్, లయన్ అజయ్ విరూపాక్ష, లయన్ దొంతుల సత్యనారాయణ, లయన్ ఎల్లంరాజు, లయన్ టీచర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు