స్టేషన్లో ఉన్న నా భర్తతో ఫోన్లో మాట్లాడించడానికి ఓ పోలీసు రెండువేలు లంచం అడిగిండు
అన్ని పైసల్లేవంటే.. వెయ్యి రూపాయలు లంచం ఇస్తే మాట్లాడించిండు
ప్రభుత్వం స్పందించి నా భర్తను ఇడిసిపెట్టక పోతే.. న్యాయం కోసం ఢిల్లీ దాకా పోతా
నా భర్తను అకారణంగా జైల్లో వేసి కొడుతున్నరు
ఏ ప్రభుత్వమైనా రైతులతో రాజకీయం చేయొద్దన్నా
ఈ సమయంలో ఏ ఆడకూతురికైనా పెనిమిటి దగ్గరుంటే ధైర్యం ఉంటది
ఆయన దగ్గరలేకుంటే భయమైతుందన్నా! కడుపులో ఉన్న నా బిడ్డ ఆగమైతదని బుగులైతున్నది
ఓ ఆడపిల్ల ఘోష పట్టించుకునే నాథుడు లేడా!
ఎవ్వరినైనా కలుస్తా! మానవ హక్కుల కమిషన్ ముందు నా గోడు వినిపిస్తా!
ఇంత అన్యాయం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నడు – పాత్లావత్ జ్యోతి, ప్రవీణ్ భార్య