ములుగులో దెయ్యం భయం
మంత్రి సీతక్కకి ఎక్కువ మెజారిటీ ఇచ్చి గెలిపించిన గ్రామం ఆపదలో ఉంటే కనీసం మంత్రి అయ్యాక పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన
ములుగు – జంగాలపల్లి గ్రామస్థులు దెయ్యం భయంతో గజగజ వణికిపోతున్నారు.
గ్రామంలో 2 నెలల వ్యవధిలో సుమారు 20 మంది మృత్యువాత.. ఆసుపత్రికి వెళ్లిన జంగాలపల్లి వాసులు శవాలుగా తిరిగి వస్తున్నారని గ్రామస్థులు తెలిపారు.
దీంతో గ్రామానికి కీడు సోకిందని, దెయ్యం ఉందని ప్రచారం జోరుగా సాగుతోంది.
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండానే వరుసగా మరణిస్తుండటంతో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటున్నారు.
గ్రామదేవతలు, బొడ్రాయికి పూజలు చేయాలని చర్చించుకుంటున్నారు.