Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికైన ఎండి సర్వర్ పాషా( అజార్)


తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికైన ఎండి సర్వర్ పాషా( అజార్)
గజ్వేల్ డిసెంబర్ 04,(Q6) రిపోర్టర్ మురళి

గజ్వేల్ ప్రజ్ఞాపూర్, డిసెంబర్,  తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో 9186 మెజారిటీతో ప్రెసిడెంట్ గా ఎన్నికైన ఎండి.సర్వర్ పాషా (అజార్) కాంగ్రెస్ పార్టీకి నిరంతరం  అలుపెరుగని ఒక యువ కెరటంలా పార్టీ అభ్యున్నత కొరకు పనిచేస్తూ నాయకుల చేత మన్నేలు పొందిన వ్యక్తిగా ఈరోజు అతని గుర్తించి తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ఎన్నికలలో ఫలితాలు భాగంగా ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎండి సర్వర్ పాషా (అజార్) మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నాపై నమ్మకంతో నియమితులు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తను గుర్తుంచి,  కాంగ్రెస్ పార్టీ ఒక కన్నతల్లి లాగా చూసుకొని సమాజంలో ఎదుగుదల కొరకు ప్రతినిత్యం కృషి చేస్తుందని అన్నారు. నాకు ఈ అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎల్లవేళలా పార్టీ కొరకు పని చేస్తూ మంచి గుర్తింపు తెస్తానని పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను . నాపై నమ్మకంతో నాకు సహకరించిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ తెలంగాణ రాష్ట్ర గజ్వేల్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎండి సర్వర్ పాషా (అజార్) గజ్వేల్ మైనార్టీ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మదీనా మజీద్ అధ్యక్షులు మతిన్, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News