Q6 వెబ్ సైట్
గజ్వేల్ డిసెంబర్ 11(Q6) రిపోర్టర్ మురళి
పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ వారి కదలికలను గమనించాలని స్థానిక సీఐలు బి. Saidha ముత్యం రాజులు అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని పాన్ డబ్బాలు, టీ ,పాయింట్లు నీ,తనిఖీ చేశారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధ ఆదేశాలతో గంజాయి మత్తు పదార్థాలపై తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు.
గంజాయి,మత్తు పదార్థాల నివారణ గురించి నార్కటిక్స్ డాగ్స్ అనుమానస్పద ప్రాంతాలలో తనిఖీలునిర్వహించడంజరిగిందన్నారు.గంజాయి రహిత జిల్లా గా ఏర్పాటు చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. గజ్వేల్ పట్టణంలో ఉన్న పాన్ డబ్బాలు, టీ పాయింట్స్ లలో పట్టణ శివారు ప్రాంతంలో జాగిలాలతో తనిఖీ చేశామన్నారు. మత్తు పదార్థాలు ,మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్స్ ఎవరైనా కలిగి ఉన్నా సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమంగా రవాణా చేసిన పాన్ షాపులలో కానీ ఇతర షాపులలో అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.గంజాయి ఇతర మత్తుపదార్థాలు ఎవరైనా కలిగి ఉంటే అమ్మిన విక్రయించిన వెంటనే డయల్ 100, గజ్వేల్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.